Tuesday, January 14, 2025

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంతో బెంచ్ మార్క్ సూచీలు రాణించాయి. అంతేకాక ప్రపంచ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు అందడంతో లాభాల్లో ముగిశాయి. నిఫ్టీలో 43 షేర్లు లాభపడగా, 7 షేర్లు నష్టపోయాయి. ప్రధానంగా లాభపడిన షేర్లలో ఓఎన్ జిసి, బిఈఎల్, ఎల్ టి, బిపిసిఎల్, శ్రీరామ్ ఫినాన్స్ ఉండగా, ప్రధానంగా నష్టపోయిన షేర్లలో జెఎస్ డబ్ల్యుస్టీల్, టెక్ మహీంద్ర, ఇన్ఫీ, మారుతి, బజాజ్ ఆటో ఉన్నాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 745.00 నష్టపోయి రూ. 76871.00 వద్ద ట్రేడయింది. కాగా డాలరుతో రూపాయి మారకం రూ. 0.18 పైసలు నష్టపోయి రూ. 84.29 వద్ద ట్రేడయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News