Monday, December 23, 2024

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ దేశీయ సూచీలు జీవితకాల గరిష్ఠాలకు చేరడం, కీలక కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాగా ఒడిదుడుకులకు గురయ్యాయి. మిడ్ సెషన్ తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దాంతో ఒత్తిడి పెరిగింది.

సెన్సెక్స్ 220.05 పాయింట్లు లేక 0.29 శాతం పతనమై 75170.45 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 44.30 లేక 0.19 శాతం పతనమై 22888.15 వద్ద ముగిసింది. నిఫ్టీలో ప్రధానంగా లాభపడిని షేర్లలో దివీస్ ల్యాబ్, ఎస్ బిఐ లైఫ్, హెచ్ డిఎఫ్ సి లైఫ్, గ్రాసిం ఇండస్ట్రీస్ ఉండగా, నష్టపోయిన షేర్లలో అదానీ ఫోర్స్ట్ సెజ్, పవర్ గ్రిడ్, బిపిసిఎల్, కోల్ ఇండియా లిమిటెడ్ ఉన్నాయి. డాలరు మారకంతో పోల్చినప్పుడు రూపాయి విలువ 0.04 పైసలు లేక 0.05 శాతం లాభపడి ఓ డాలరు విలువ రూ. 83.18 వద్ద ట్రేడయింది.  కాగా బంగారం 10 గ్రా. ధర రూ. 54.00 లేక 0.07 శాతం పడిపోయి 71955.00 వద్ద ట్రేడయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News