Thursday, January 23, 2025

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాల్లో ముగిశాయి. అమెరికాలో వెలువడిని ఫ్యాక్టరీ డేటా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని సూచిస్తుండడంతో మదుపర్లలో బెరుకు మొదలయింది. అంతేకాక ఆసియా మార్కెట్లు కూడా నష్టపోయాయి. ఒక్క సెషన్ లోనే మదుపర్ల రూ. 5 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. జపాన్ మార్కెట్ కూడా బాగా క్రాష్ అయింది.

నేడు సెన్సెక్స్ 885.60 పాయింట్లు లేక 1.08 శాతం నష్టంతో 80981.95 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 293.21 పాయింట్లు లేక 1.17 శాతం నష్టంతో 24717.70 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ 500 లో ప్రధానంగా జోమాటో, అదానీ విల్మర్, ఫిలిఫ్స్ కార్బన్, జె అండ్ కె బ్యాక్ లాభపడగా, కమ్మిన్స్ ఇండియా, ఎస్కార్ట్స్, బిర్లాసాఫ్ట్, ఇమామి షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఇదిలావుండగా బంగారం 446 రూపాయలు లేక 0.64 శాతం పెరిగి రూ. 70100.00 వద్ద ట్రేడయింది. అమెరికా డాలరు మారకం 0.01 పైసలు లేక 0.01 శాతం పెరిగి రూ. 83.74 వద్ద ట్రేడయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News