Wednesday, December 25, 2024

అస్సాంలో స్టాక్ మార్కెట్ మోసగాడు పరార్!

- Advertisement -
- Advertisement -

గువాహతి: నేడు టెక్నాలజీ ఎంతగా పెరిగినప్పటికీ జనాలని మోసగించే టెక్నాలజీ కూడా పెరిగిందనే చెప్పాలి. ఎందుకంటే నేడు సైబర్ మోసాలకు హద్దే లేకుండా పోతోంది. సైబర్ మోసగాళ్లను పోలీసులు పట్టుకుని శిక్ష విధిస్తోంది కూడా చాలా తక్కువే.

అస్సాంలో 29 ఏళ్ల దీపాంకర్ బర్మన్ అనే యువకుడు చాలా మంది అమాయక మదుపరులకు బురిడీ కొట్టించాడు. డిబి స్టాక్ బ్రోకింగ్ కంపెనీకి తాను డైరెక్టర్ అని చెప్పుకుని మరీ మోసం చేశాడు. పెట్టుబడిపై మంచి లాభాలను అందిస్తానని తన క్లయింట్లను నమ్మించి మోసగించాడు. ఇప్పుడు గువాహతిలోని తన కార్యాలయాన్ని కూడా మూసేసి పారిపోయాడు. దాంతో అతడిని నమ్మిన అనేక మంది మదుపరులు ఏమిచేయాలో పాలుపోని స్థితిలో పడ్డారు. పోలీసులు ఇప్పటి వరకు 59 మందిన అరెస్టు చేసి 28 కేసులు పెట్టారు.

బర్మన్ ను పట్టుకుని ఇంకా అనేక విషయాలు తెలుసుకోవలసి ఉంది. అతడిలాంటి ‘ట్రేడింగ్ స్కామ్ స్టర్స్’ మన దేశంలో చాలా మందే ఉన్నారు. బురుడీ కొట్టిస్తూనే ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News