Sunday, December 22, 2024

మార్కెట్లు మళ్లీ లాభాల బాట

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు మళ్లీ లాభాల బాటపట్టాయి. కొద్ది రోజులుగా బుల్ జోరు తగ్గి భేరిష్ వాతావరణం కనిపించింది. నిఫ్టీ ఓ దశలో 20,000 పాయింట్ల మార్క్‌ను టచ్ చేసింది. కానీ ఆ తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టడం, ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచడం వంటి కారణాల వల్ల మార్కెట్లు పతనమయ్యాయి. నిఫ్టీ మళ్లీ 19,500 పాయింట్లకు దిగువకు పడిపోయింది.

ఆ తర్వాత 19,200 పాయింట్లకు డౌన్ అయింది. అయితే మార్కెట్ విశ్లేషకులు నిఫ్టీ 19 వేల దిగువకు పడిపోతుందని అంచనా, దిద్దుబాటు ఉంటుందని అంచనా వేశారు. కానీ గత రెండు వారాలుగా మార్కెట్లు అనూహ్యంగా పెరగడం ప్రారంభించాయి. మళ్లీ నిఫ్టీ 19,800 పాయింట్ల మార్క్‌ను దాటింది. బుల్స్ జోరు తగ్గలేదని గత రెండు వారాలుగా మార్కెట్లు నిరూపించాయి. ఎట్టకేలకు ఇండెక్స్‌లు ఆరు వారాల గరిష్ఠానికి చేరుకున్నాయి. వారాంతం శుక్రవారం ఎనర్జీ స్టాక్స్‌లో కొనుగోళ్ల కారణంగా మార్కెట్లు జంప్ చేశాయి.

అంతర్జాతీయంగా మార్కెట్లు సానుకూలంగా లేకున్నప్పటికీ భారతీయ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 333 పాయింట్లు పెరిగి 66,598 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 19,819 పాయింట్లు లాభపడి 19,819 పాయింట్ల వద్ద స్థిరపడింది. సూచీలు జూన్ 30 నుంచి చూస్తే వరుసగా రెండో వారం లాభపడి ఉత్తమ వారంగా నిలిచాయి. రెలిగేర్ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా మాట్లాడుతూ, కొన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల వల్ల సానుకూల వాతావరణం ఏర్పడిందని అన్నారు.

నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు గత రెండు నెలల కనిష్టం నుంచి దాదాపు 3 శాతం రికవరీ అయ్యాయి. దేశీయ తొలి త్రైమాసికం జిడిపి వృద్ధి రేటు 7.8 శాతం గణాంకాలతో మార్కెట్లకు సానుకూలంగా మారాయి. మరోవైపు స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ తమ లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. ఈ రెండు సూచీలు వరుసగా 0.6 శాతం, 1 శాతం చొప్పున పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News