Monday, December 23, 2024

2024లో స్టాక్‌మార్కెట్‌కు 14 సెలవులు

- Advertisement -
- Advertisement -

అదనంగా వారాంతపు శని, ఆదివారం సెలవులు కూడా..

ముంబై : స్టాక్ మార్కెట్‌కు 2023 గోల్డెన్ ఇయర్‌గా అవతరించింది. ఎందుకంటే మార్కెట్ 2023లో ఇన్వెస్టర్ల భారీ లాభాలను ఇచ్చింది. నేటి కొత్త సంవత్సరం 2024 ప్రారంభమైంది. కొత్త సంవత్సరంలో స్టాక్ మార్కెట్‌కు సెలవులు ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా రిపబ్లిక్ డే, మహాశివరాత్రి, హోలీ, ఈద్, రామ నవమి, స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి వంటి పండుగల కారణంగా స్టాక్‌మార్కెట్ మొత్తం 14 రోజుల పాటు మూతపడి ఉంటుంది. ఇక ఈ సెలవుల్లో శని, ఆదివారాలు అదనంగా ఉంటాయి.

2024లో స్టాక్‌మార్కెట్ సెలవుల జాబితా..
రిపబ్లిక్ డే కారణంగా జనవరి 26న స్టాక్ మార్కెట్ మూసివేస్తారు. ఇంకా మార్చి 8న మహాశివరాత్రి, మార్చి 25 హోలీ, మార్చి 29న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 11న ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ ఈద్), ఏప్రిల్ 17న రామ నవమి, మే 1న మహారాష్ట్ర దినోత్సవం, జూన్ 17న బక్రీద్, జూలై 17న మొహర్రం, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం, అక్టోబర్ 2న గాంధీ జయంతి, నవంబర్ 1న దీపావళి, నవంబర్ 15న గురునానక్ జయంతి, డిసెంబర్ 25న
క్రిస్మస్ వంటి సెలవులు ఉన్నాయి. 2024లో స్టాక్ మార్కెట్‌లో మొత్తం 52 వారాంతాలు అంటే శని, ఆదివారాలు సెలవులు ఉంటాయి. దీంతో మార్కెట్ వారాంతాల్లో మొత్తం 104 రోజుల పాటు మూసివేసి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News