న్యూఢిల్లీ : ఈ వారం నాలుగు రోజులే స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఉంటుంది. ఈద్ సెలవు కారణంగా బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలలో ట్రేడింగ్ ఏప్రిల్ 11న ఉండదు. ఈద్ సెలవుల కారణంగా ఈ వారం ఐదు ట్రేడింగ్ రోజుల్లో నాలుగు రోజులు మాత్రమే ట్రేడింగ్ ఉంటుంది. ఇక శని, ఆదివారాలు సాధారణంగా మార్కెట్‌కి సెలవు ఉంటుంది. 2024 ఏప్రిల్‌లో 17వ తేదీన కూడా రామనవమి పండుగ కారణంగా మార్కెట్లకు సెలవు ఉంది.
ఏప్రిల్‌లో శని, ఆదివారాలు సెలవులు కలిపితే స్టాక్ మార్కెట్ మొత్తం 10 రోజులు ట్రేడింగ్ జరగదు, కేవలం 20 రోజులు మాత్రమే ట్రేడ్ ఉంటుంది. వచ్చే వారం స్టాక్ మార్కెట్‌కే కాదు బ్యాంకులకు కూడా చాలా సెలవులు ఉన్నాయి. ఏప్రిల్ 9 నుంచి బ్యాంకులకు సెలవులు రానున్నాయి. గుడి పడ్వా, ఉగాది, రంజాన్ వంటి పండుగల బ్యాంకులకు చాలా సెలవు ఉన్నాయి.
2024లో స్టాక్ మార్కెట్ సెలవులివే..
ఏప్రిల్ 11న ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ ఈద్), ఏప్రిల్ 17న రామ నవమి, మే 1న- మహారాష్ట్ర డే మార్కెట్లకు సెలవు, జూన్ 17న బక్రీద్, జూలై 17న మొహర్రం, ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం, అక్టోబర్ 2న గాంధీ జయంతి, నవంబర్ 1న దీపావళి, నవంబర్ 15న గురునానక్ జయంతి, డిసెంబర్ 25న క్రిస్మస్ కారణంగా మార్కెట్‌కు సెలవు ఉంటుంది.