Sunday, December 22, 2024

ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు(మంగళవారం) ఫ్లాట్ గా ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయంలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఫైనాన్షియల్ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. పేలవమైన(ల్యాక్ లస్టర్) ట్రేడింగ్ తర్వాత సెన్సెక్స్ ఫ్లాట్ గా ముగిసింది.

సెన్సెక్స్ 33.49 పాయింట్లు లేక 0.04 శాతం పతనమై 76456.59 వద్ద ముగియగా, నిఫ్టీ 5.65 పాయింట్లు లేక 0.02 శాతం పతనమై 23264.85 వద్ద ముగిసింది. నేడు నిఫ్టీలో ఓఎన్ జిసి, ఎల్ అండ్ టి, అదానీ పోర్ట్స్ సెజ్, టాటా మోటార్స్ టాప్ గెయినర్లుగా నిలువగా, కొటక్ బ్యాంక్, డివీస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు టాప్ లూజర్స్ గా నిలిచాయి.  బంగారం ధర రూ. 100.00 లేక 0.14 శాతం పడిపోయి రూ. 71338.00 వద్ద స్థిర పడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 0.06 లేక 0.07 శాతం పెరిగి రూ. 83.58 వద్ద స్థిరపడింది.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News