Monday, November 18, 2024

నేడు లాభాల్లోకి దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

భారతీయ స్టాక్ మార్కెట్ షేర్లు నేడు(గురువారం) రీబౌండ్ అయ్యాయి. ఇండియా సిమెంట్స్ లో 23 శాతం వాటా పొందుతున్నట్లు ప్రకటించడంతో అల్ట్రా సిమెంట్ స్టాక్ ధర పెరిగింది.  ఎన్ఎస్ఈ 50 సూచిక 24000 మార్కును దాటింది. సెన్సెక్స్ 79000 మార్కును దాటింది.

దేశంలోనే అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ …దేశంలోని మరో సిమెంట్ కంపెనీ అయిన ఇండియా సిమెంట్స్లో రూ. 18.85 బిలియన్(226 మిలియన్ అమెరికా డాలర్లు) విలువ చేసే వాటాను కొనుగోలుచేయడంతో కంపెనీ షేరు ధర 4.3 శాతం పెరిగింది. ఇక ఇండియా సిమెంట్స్ 12 శాతం మేరకు పెరిగింది. ఇక ఆర్ఐఎల్ పవర్ షేరు కూడా రికార్డు హైకి పెరిగింది.

ఇంకా రూట్ మొబైల్, విర్ల్ పూల్, మనప్పురం ఫైనాన్స్ కంపెనీల షేర్లు కూడా బాగా పెరిగాయి. ఇక నష్టపోయిన షేర్లలో దీపక్ ఫెర్టిలైజర్స్, ఇండియన్ హోటల్స్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News