Monday, December 23, 2024

రుతుపవనాలే కీలకం

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లలో గత కొద్ది వారాలుగా బూమ్ కనిపిస్తోంది. భారీ ర్యాలీ లేకపోయినప్పటికీ మా ర్కెట్ సూచీలు అయిన సెన్సెక్స్, నిఫ్టీలు చరిత్రలోనే తొలిసారి సరికొత్త గరిష్టాలను చేరుకోగలిగాయి. దీని తరువాత ఇప్పుడు కొత్త ట్రేడింగ్ వారం జూన్ 19 (సోమవారం) నుండి ప్రారంభం కానుంది. గతవారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 758.95 పాయింట్లు లేదా 1.21 శాతం లాభపడింది.

వారాంతం శుక్రవారం 466 పాయింట్ల లాభంతో 63,384 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకుముందు 2022 డి సెంబర్ 1న సెన్సెక్స్ 63,284 పాయింట్ల స్థాయిలో ముగిసింది. మళ్లీ ఆ స్థాయిని మించి ఇప్పుడు మార్కెట్ గరిష్ఠానికి చేరింది. అలాగే నిఫ్టీ కూడా 137.90 పాయింట్లు లే దా 0.74 శాతం పెరిగి 18,826 వద్ద సరికొత్త రికార్డును నమోదు చేసింది. నిఫ్టీ గత రికార్డు స్థాయి 18,812.50 పాయింట్లుగా ఉంది. ఈ విధంగా రెండు ప్రధాన సూచీలు గత వారంలో కొత్త రికార్డును సృష్టించాయి.
ఈ వారం మార్కెట్..
స్టాక్ మార్కెట్ల దిశ ఎక్కువగా ప్రపంచ మార్కెట్ల ట్రెండ్, విదేశీ ఇన్వెస్టర్ల ట్రెండ్, రుతుపవనాల కదలికల ద్వారా ప్రభావితమవుతుంది. దీంతోపాటు రూపాయి మారకం హెచ్చుతగ్గులు, ముడిచమురు ధరల కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో రుతుపవనాల పురోగతి ఎలా ఉంటుందనేది, మార్కెట్‌పై ప్రభా వం చూపనుంది.

అదే సమయంలో మార్కెట్లు కొత్త రికా ర్డు గరిష్టాలను చేరుకోవడంతో ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ కొనసాగుతుంది. మార్కెట్ ఉన్నత స్థాయికి చేరుకున్నప్పు డు అమ్మకాలు పెరగడం కనిపిస్తుంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచలేదు, ఇది స్థాని క మార్కెట్‌లో సెంటిమెంట్‌ను బలపరిచింది. సానుకూల ప్రపంచ సంకేతాలు, విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లూ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News