Thursday, January 9, 2025

హెచ్చుతగ్గుల్లో మార్కెట్లు..

- Advertisement -
- Advertisement -

హెచ్చుతగ్గుల్లో మార్కెట్లు
338 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం తీవ్ర హెచ్చుతగ్గులను చూశాయి. ఉదయం నుంచే నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆఖరి వరకు అదే ధోరణిని కొనసాగించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 338 పాయింట్లు పతనమై 65,151 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 99 పాయింట్లు క్షీణించి 19,365 వద్ద స్థిరపడింది. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 22 క్షీణించగా, 8 లాభపడ్డాయి.

అయితే గత రెండు రోజులుగా లాభాలను చూస్తున్న మార్కెట్ల జోరుకు బ్రేక్ పడింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు స్వల్ప లాభాలను చవిచూశాయి. ఎనర్జీ, ఎఫ్‌ఎమ్‌సిజి, ఇన్‌ఫ్రా షేర్లు ఒత్తిడిలో ఉండగా, ఐటి, ఫార్మా, పిఎస్‌ఇ షేర్లలో అమ్మకాలు పెరిగాయి. పిఎస్‌యు బ్యాంక్ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్ స్టాక్ 4.43 శాతం పెరిగింది. జిక్యూజి పార్ట్‌నర్స్ అదానీ పవర్‌లో రూ. 8,700 కోట్ల పెట్టుబడులు పెట్టడం వల్ల అదానీ పవర్ స్టాక్ 3 శాతం జంప్ చేసింది.

పిరమిడ్ టెక్నాప్లాస్ట్ ఐపిఒ
పిరమిడ్ టెక్నాప్లాస్ట్ ఐపిఒ పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ ఆగస్టు 18న ప్రారంభం కానుంది. ఈ పబ్లిక్ ఆఫర్ అంటే ఐపిఒ ద్వారా కంపెనీ కంపెనీ రూ.153.05 కోట్లను సమీకరించాలనుకుంటోంది. రిటైల్ పెట్టుబడిదారులు ఆగస్టు 22 వరకు ఈ ఐపిఒలో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంది. కంపెనీ షేర్లు ఆగస్టు 30న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్‌ఇ)లో లిస్ట్ కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News