Wednesday, January 22, 2025

స్టాక్ మార్కెట్ జోరు

- Advertisement -
- Advertisement -

స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో పరుగులు పెడుతున్నాయి. ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో స్టాక్ మార్కెట్ కు ఊపొచ్చినట్టు కనబడుతోంది. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలవడంతో సెన్సెక్స్, నిఫ్టీ జోరందుకున్నాయి. మంగళవారం ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి.

ఉదయం సెన్సెక్స్ 90 పాయింట్ల లాభంతో 68,957 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 20,725 వద్ద ట్రేడవుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 69,035 వద్ద జీవనకాల గరిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ 30లోని షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ మూడు పైసలు పతనమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News