Friday, November 22, 2024

బడ్జెట్‌కు మదుపరి జై..

- Advertisement -
- Advertisement -

Stock markets gained 5 percent

 

ఆర్థిక మంత్రి నిర్మల ప్రసంగం తర్వాత మార్కెట్లలో జోష్

ఒక్క రోజే సెన్సెక్స్ 2,314 పాయింట్లు జంప్ n రూ.6.34 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

కొద్ది రోజులుగా పతనమవుతూ వస్తున్న స్టాక్‌మార్కెట్లు నిర్మల బడ్జెట్‌కు జైకొట్టాయి. ఎంతలా అంటే ఒక్క రోజే మార్కెట్లు 5 శాతం లాభపడ్డాయి. గత పదేళ్లలో బడ్జెట్ రోజున ఎన్నడూ ఇంతలా మార్కెట్లు పెరగలేదు. ముఖ్యంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత మార్కెట్లు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాయి. సెన్సెక్స్ 2,314 పాయింట్లు (5%) లాభంతో 48,600 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 646 పాయింట్లు లాభంతో 14,281 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన అనూహ్య స్పందనతో ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజే రూ.6.34 లక్షల కోట్లు
పెరిగింది. సానుకూల మార్కెట్ కావడంతో బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ మూలధనం రూ.6,34 లక్షల కోట్లు పెరిగి రూ.192 లక్షల కోట్లకు పెరిగింది.

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లలో కొద్ది రోజులుగా ఉన్న భయా లు పోయి ఆ స్థానంలో సోమవారం బడ్జెట్ రోజు ఉత్సాహం కనిపించింది. మోడీ పదవీకాలంలో ఇది తొమ్మిదో బడ్జెట్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్‌ఇ) సెన్సెక్స్ 2314.84 పాయింట్లు లేదా 5 శాతం పెరిగింది. ఆఖరికి 48,600పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఇండెక్స్ కూడా 646పాయింట్లు లాభంతో 14,328పాయింట్ల వద్ద ముగి సింది. 1997లో బడ్జెట్ రోజున ఇండెక్స్ 6శాతం పెరగ్గా, ఆ తర్వాత ఇంతటి స్థాయి విజృంభణ కనిపించింది. మార్కెట్ జంప్‌లో బ్యాంకింగ్ షేర్లు ముందంజలో ఉన్నా యి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 8.81% పెరిగి 33,257 వద్ద ముగిసింది. ఇది ఇండెక్స్‌లో ఆల్టైమ్ హై లెవెల్‌కు చేరింది. బిఎస్‌ఇలో 3,129 షేర్లతో ట్రేడయ్యాయి. 1,947 షేర్లు పెరగ్గా, 981 షేర్లు క్షీణించాయి. అంటే ఎక్స్ఛేంజ్‌లో 62% షేర్లు లాభపడ్డాయి. లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కె ట్ క్యాప్ శుక్రవారం రూ.186.132 లక్షల కోట్లతో పోలిస్తే రూ.192.62 లక్షల కోట్లకు పెరిగింది.

అంతకుముందు మార్కెట్ వరుసగా 6 సెషన్లు నష్టాలను చూసిం ది. బంగారం, వెండి దిగుమతిపై 2.5% అగ్రి ఇన్‌ఫ్రా సెస్ విధించాలని ప్రభుత్వం తెలిపింది. ఫలితంగా టైటాన్ షేర్లు 5.47%, మణప్పురం ఫైనాన్స్ షేర్లు 5.51%, ముథూ ట్ ఫైనాన్స్ షేర్లు 4.48% లాభపడ్డాయి. సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్‌ను ప్రభుత్వం తీసుకువస్తోంది. సెబీ చట్టం, ప్రభుత్వ సెక్యూరిటీ చట్టం, డిపాజిటరీల చట్టం ఇందులో ఉంటాయి. సెబీ బంగారం కోసం రెగ్యులేటర్‌గా కూడా ఉంటుంది. 2020-21 ఆర్థిక లోటు జిడిపిలో 9.5% ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

ఇది 2021-22కి 6.8%గా అంచనా వేసింది. ప్రభుత్వం బీమా చట్టం 1938 ను సవరించనుంది. దీని కింద బీమా కంపెనీల్లో ఎఫ్‌డిఐ పరిమితిని 49% నుంచి 74 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపె నీ షేర్లు 8.94%, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ షేర్లు 3.14%, ఎస్‌బి ఐ లైఫ్ షేర్లు 1.20%, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు 1.90% పెరిగాయి. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కింద దేశంలోని మరో 100 నగరాలను ప్రభు త్వం కలుపుతుందని ఆర్థిక మంత్రి చెప్పారు. దీంతో ఇంద్రప్రస్థ గ్యాస్ 3.59 శాతం, మహానగర్ గ్యాస్ 2.28 శాతం పెరిగాయి. అమెరికా మార్కెట్లు భారీగా పడిపోగా, ప్రపంచ సెంటిమెంట్ చాలా అస్థిరంగా ఉంది.

తయారీ రంగం మూడు నెలల గరిష్ఠానికి

భారతదేశ తయారీ కొనుగోలు నిర్వహణ సూచీ (పిఎం ఐ) డిసెంబరులో 56.4 నుండి జనవరిలో మూడు నెలల గరిష్ట స్థాయి 57.7 కి చేరుకుంది. ఇక్కడ 50 పైన ఉండ డం అంటే సానుకూల వృద్ధి. ఇది కాకుండా జిఎస్‌టి వసూళ్లు కూడా రికార్డు స్థాయిలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News