- Advertisement -
దేశీయ స్టాక్ మార్కెట్‌లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ప్రారంభమైన నిఫ్టీ, సెన్సెక్స్ లు గత అన్ని రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతున్నాయి. ఈరోజు ట్రేడింగ్ 128 పాయింట్లు లాభపడి సెన్సెక్స్ 69,954కు చేరుకుంది. నిఫ్టీ 23 పాయింట్లు మెరుగుబడి 20,992 వద్ద కొనసాగుతుంది.
సెన్సెక్స్ ఇండెక్స్ లో ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్ సిఎల్ టెక్, టాటా మోటార్స్, ఎస్ బిఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసి షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా… ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్‌ఎం, టైటన్, విప్రో, మారుతీ, హెచ్ యుఎల్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
- Advertisement -