Sunday, January 19, 2025

స్టాక్​ మార్కెట్లు భారీగా పెరుగుతాయి: అమిత్​ షా

- Advertisement -
- Advertisement -

ముంబై: స్టాక్ మార్కెట్ల పతనంపై అమిత్ షా స్పందించారు.   ‘‘నిజానికి స్టాక్ మార్కెట్లు పడిపోవడానికి ఎన్నికలకు ముడిపెట్టవద్దు.  ఇంతకు ముందు 16 సార్లు మార్కెట్లు భారీగా కరెక్షన్లకు గురయ్యాయి. ఇప్పుడు బిజెపికి సీట్లు తగ్గుతాయన్న వదంతులు ఎన్ని వ్యాప్తి చెందినా సరే. నేను సూచిస్తున్నది ఏమిటంటే.. జూన్ 4వ తేదీలోగా స్టాక్ మార్కెట్లో షేర్లు కొని పెట్టుకోండి. స్టాక్ మార్కెట్లు భారీగా పెరుగుతాయి..” అని పేర్కొన్నారు. జాతీయ మీడియా సంస్థ ఎన్డీ టివికి సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక అంశాలపై మాట్లాడారు.

స్టాక్ మార్కెట్లకు ఎన్నికలకు సంబంధం లేకున్నా.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే మంచి పనితీరు ఉంటుందని అమిత్ షా చెప్పారు.  ‘‘మాకు  400కు పైగా ఎంపీ సీట్లు వస్తాయి.  స్థిరమైన మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. దీనితో షేర్ మార్కెట్ కూడా పెరుగుతుంది” అని పేర్కొన్నారు. బిజెపి, దాని మిత్ర పక్షాలు భారీగా సీట్లు సాధించడం ఖాయమన్నారు.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News