Friday, December 20, 2024

ఇన్వర్టర్లు, కొవ్వొత్తులతో పాటు ఈ వస్తువులు స్టాక్ పెట్టుకోండి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలం గాణ రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో 6 గ్యారంటీల హామీతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలు అంటించిన కెటిఆర్, కాంగ్రెస్ పాలన ఫెయిల్యూర్ పాలన అంటూ తనదైన శైలిలో సోషల్ మీడియా వేదిక గా ఎటాక్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమని బిఆర్‌ఎస్ ప్రభుత్వం కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం లోని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రస్తుత కాలంలో కొన్ని ఉత్పత్తులను నిలువ చేసుకోవాలని అభ్యర్థించారు.

తెలంగాణలో ఎన్నికలు ముగిస్తే వాటి అవసరం తప్పనిసరిగా ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల లాగా, తాను ఆరు వస్తువులు చెబుతున్నానని వాటిని స్టాక్ పెట్టుకోవాలని సూచించారు. ఇవే కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలని, అందులో 1. ఇన్వర్టర్ 2. చార్జింగ్ బల్బులు, 3. టార్చ్ లైట్లు, 4. కొవ్వొత్తులు, 5. జనరేటర్లు, 6. పవర్ బ్యాంకులు అంటూ కెటిఆర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్టాక్ పెట్టుకోవాలని ఆయన సూచించారు. వీటినే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు గా హామీ ఇచ్చిందని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ప్రజలందరూ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రోజు తెలి విగా ఆలోచించి ఓటు వేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News