ముంబై: గత ఐదు రోజులుగా నష్టాల బాటలో నడిచిన స్టాక్ మార్కెట్ నేడు పుంజుకుంది. రాబోయే పర్వదినం దీపావళి సెంటిమెంట్ కావొచ్చు ఈ ఊతానికి కారణం. ఫైనాన్షియల్స్, రియాలిటీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో కొనుగోళ్లు ఊతం ఇచ్చాయి. నిఫ్టీ 158.36 పాయింట్లు లేక 0.65 శాతం పెరిగి 24339.15వద్ద ముగిసింది. సెన్సెక్స్ 602.75 పాయింట్లు లేక 0.75 శాతం పెరిగి 80005.04 వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈలో నేడు శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ నెట్, ఐసిఐసిఐ బ్యాంక్, జెఎస్ డబ్ల్యు స్టీల్, విప్రో షేర్లు ప్రధానంగా లాభపడగా, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటోకార్పొ, బెల్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. నేడు బులియన్ మార్కెట్ లో స్వచ్ఛమైన బంగారా(24 క్యారెట్లు) పది గ్రాములు రూ. 332.00 లేక 0.42 శాతం నష్టపోయి రూ.78200.00 ముగిసింది. ఇక అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 0.02 పైసలు లేక 0.02 శాతం నష్టపోయి రూ. 84.07 వద్ద ట్రేడయింది.