Sunday, December 22, 2024

ఉప్పల్‌లో భార్య గొంతుపై కాలుతో తొక్కి…. హత్య

- Advertisement -
- Advertisement -

ఉప్పల్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్‌లో భార్య గొంతుపై కాలుతో భర్త తొక్కి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎనిమిది సంవత్సరాల క్రితం జనగాంకు చెందిన భూక్యా రమేష్(34), కమలను(29) పెళ్లి చేసుకున్నాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమేష్ తన భార్య కమలతో కలిసి ఉప్పల్‌లోని బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. దంపతులు హెర్బల్ లైఫ్ న్యూటిషన్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భర్తపై భార్యకు అనుమానం రావడంతో ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఇద్దరు పని చేసి ఇంటికి వచ్చిన తరువాత దంపతుల మధ్య రాత్రి గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో భార్యపై భర్త దాడి చేశాడు. విచక్షణ కోల్పోయిన భర్త కోపంతో ఆమె గొంతుపై కాలు పెట్టి బలంగా తొక్కి హత్య చేశాడు. రాత్రి 12 గంటల సమయంలో బైక్‌పై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం స్వాధీనం చేసుకొని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News