Monday, December 23, 2024

కోర్టులో మహిళా జడ్జీపై రాయితో దాడి

- Advertisement -
- Advertisement -

నవ్‌సా: గుజరాత్‌లోని నవ్‌సారి అదనపు జిల్లా జడ్జీ శుక్రవారం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కోర్టురూములో అదనపు జిల్లా జడ్డి ఆర్‌ఆర్ దేశాయ్‌పై నిందితుడు రాయితో దాడి చేశాడు. విచారణ సందర్భంగా నిందితుడు ధర్మేష్ రాథోడ్ మహిళా జడ్జిపై రాయియి విసిరినట్లు న్యాయవాది ప్రతాప్ సిన్హ్ తెలిపారు. అయితే ఆ రాయి జడ్జిని తాకకుండా పక్కనుంచి వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి ఆమె తప్పించుకున్నారని న్యాయవాది తెలిపారు.

వెంటనే పోలసులు నిందితుడి చుట్టుముటి అతడిని కోర్టురూము నుంచి బయటకు తీసుకెళ్లిపోయారు. జడ్జిలపై దాడి చేసిన చరిత్ర నిందితుడు ధర్మేష్ రాథోడ్‌కు ఉందని, గతంలో ఒక జడ్జిపై చెప్పు విసిరాడని న్యాయవాది చెప్పారు. అయినప్పటికీ నిందితుడిని తనిఖీ చేయకుండా కోర్టురూములోకి పోలీసులు ప్రవేశపెట్టారని ఆయన చెప్పారు. ఈసంఘటనను తీవ్రంగా ఖండించిన జిల్లా బార్ అసోసియేషన్ దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News