Wednesday, January 22, 2025

పాదయాత్ర చేస్తుండగా ఇరు వర్గాల మధ్య రాళ్లదాడి

- Advertisement -
- Advertisement -

శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బిజెపి నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఒక వర్గం నాయకులు, మరో వర్గం నాయకులపైన రాళ్ల దాడికి దిగే స్థాయిలో వారి మధ్య విభేదాలు ఉన్నాయి. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీద్ బండలో పాదయాత్ర చేస్తున్న బిజెపి నేత గజ్జల యోగానంద్ వర్గంపైన బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ వర్గం రాళ్లదాడికి దిగారు. వారి మధ్య గొడవలో గజ్జల యోగానంద్‌కు చెందిన కార్ల అద్దాలు ధ్వంసం అయి పలువురికి గాయాలు కూడా అయ్యాయి. రవికుమార్ యాదవ్ వర్గం నాయకులపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్‌లో గజ్జల యోగానంద్ వర్గం నాయకులు ఫిర్యాదు చేసి దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News