Sunday, January 19, 2025

వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో వందేభారత్ రైళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా రౌర్కెలాపూరీ మధ్య నడిచే వందే భారత్ పై కొందరు ఆకతాయిలు ఆదివారం రాత్రి రాళ్లు రువ్వారు. డెంకనల్‌అంగుల్ రైల్వే సెక్షన్ లోని మెరమండలి బుధపాంక్ స్టేషన్ల మధ్య ఈ సంఘటన జరిగిందని సోమవారం అధికారులు వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ కిటికీ ధ్వంసమైనట్టు తెలిపారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. ఈ సంఘటనతో 13 నిమిషాలు ఆలస్యంగా రైలు పూరీ చేరుకున్నట్టు తెలిపారు. రైల్వే అధికారులు ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీస్‌లను అప్రమత్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్‌లను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News