Saturday, November 9, 2024

ఏళ్లుగా తాపడం పనిలో అయోధ్య గుడిలో మేలురాళ్లు

- Advertisement -
- Advertisement -

అయోధ్య : స్థానికంగా ప్రత్యేక రాళ్లకు మెరుగులు దిద్దే వర్క్‌షాప్ ఇక్కడికి వచ్చిపోయే వారికి ప్రత్యేక ఆకర్షణ అయింది. సుప్రీంకోర్టు ద్వారా రామాలయ నిర్మాణానికి అనుకూల తీర్పు తరువాత నాలుగేళ్లుగా ఇక్కడ రాళ్లకు తాపడం పని జరుగుతోంది. ఇక్కడ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకూ కొందరు మహిళలు పని చేస్తున్నారు. కరసేవకపురంలో వెలిసిన ఈ కార్యక్షేత్రంలో పనిచేసే మహిళలలో ఆర్తి అనే మహిళ తాను ఏడాది నుంచి ఇక్కడ పనిచేస్తున్నట్లు తెలిపారు.

ఇక్కడ తాపడం పట్టిన రాళ్లు రామాలయ ప్రాంగణానికి పంపిస్తూ వచ్చామని, ఈ రాళ్లు అయోధ్య ఆలయ వైభవానికి తాము సైతం అనే రీతిలో వైభవం చాటుకున్నాయని, దీని వెనుక తాము కూడా ఉండటం తమకు అదృష్టం అని తెలిపారు. నెలకు రూ 12వేల జీతం ఇస్తారని, దీనికంటే ఎక్కువ సంతృప్తి తమకు ఇక్కడి పవిత్ర పని ద్వారా సిద్ధిస్తుందని మహిళా కూలీలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News