- Advertisement -
కడూరు : బుధవారం కర్నాటకలో వందేభారత్ రైలుపై రాళ్లు విసిరారు. బెంగళూరు ధర్వాడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం కడూరు స్టేషన్‌ను దాటిన తరువాత మధ్యలో కడూరు బీరూర్ సెక్షన్‌లో రాళ్లు పడ్డాయి. వారం రోజుల వ్యవధిలో ఇటువంటి ఘటన జరగడం ఇది రెండోసారి. ట్రైన్ నెంబరు 20661 వందేభారత్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు ఈ విధంగా రాళ్లతో దాడికి దిగినట్లు భారతీయ రైల్వే వర్గాలు సాయంత్రం ప్రకటన వెలువరించాయి. ఈ నెల 1వ తేదీనే ధర్వాడ్ బెంగళూరు మధ్య నడిచే వందేభారత్‌పై కూడా రాళ్ల దాడికి దిగారు.
- Advertisement -