Monday, December 23, 2024

హింసను ప్రేరేపించే ప్రకటనలు ఆపండి

- Advertisement -
- Advertisement -

రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఇసికి బిఆర్‌ఎస్ ఫిర్యాదు

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ న్యా య విభాగం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీఈవో వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు చేసింది. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ను కించపరిచే విధంగా ఉన్న కాంగ్రెస్ ప్రకటనలను నిలిపివేయాలని మరోసారి లీగల్ టీం కోరింది. అనంతరం బీఆర్‌ఎస్ లీగల్  బృందం నేత సోమా భరత్ మాట్లాడుతూ పచ్చగా ఉన్న తెలంగాణను హింసాత్మకంగా చేసేందుకు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపిస్తూ క్యాడర్‌ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వారంలో దుబ్బాక, అచ్చంపేట ఘటనలు జరిగాయని దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికీ సీరియస్‌గానే ఉన్నారని తెలిపా రు. ఎమ్మెల్యే అభ్యర్థలపై దాడులు జరిగితే రేవంత్ రెడ్డి కనీసం మానవ త్వం లేకుండా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. పదేళ్లుగా బీఆర్‌ఎస్ పాలనలో ఎక్కడైనా ఘటనలు జరిగాయా అని ప్రశ్నించారు. ఇప్పు డు జరుగుతున్న ఘటనలు ఎవరు జరుగుతున్నాయో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. రేవంత్‌కు టీడీపీ తల్లిపార్టీ అయితే కాంగ్రెస్ అత్తపార్టీ అంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీ అంతర్గత ఒప్పందం కుదిరిందని వ్యాఖ్యలు చేశారు. స్టార్ క్యాంపెనియర్‌గా ఉన్న రేవంత్ రెడ్డి భాష పద్ధతిగా ఉండాలని హితవుపలికారు. ఎంసీసీ కమిటీకి చూపి ంచిన ప్రకటన ఒకటి బయట ప్రచారం మరొకటి చేస్తున్నారన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News