హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ తెలిపారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై బాల్కసుమన్ మాట్లాడారు. గొప్పగా అభివృద్ధి చెందుతున్న సింగరేణిని దెబ్బ తీసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు. సింగరేణిని నష్టం చేసి విద్యుత్ అవసరాలపై ప్రభావం చూపేలా ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్ని సార్లు అడిగినా విభజన హామీలపై మోడీ ప్రభుత్వం నోరు మెదపడం లేదని విరుచుకపడ్డారు. ఒడిశా, జార్ఖండ్ సిఎంలు తమ రాష్ట్రాల్లో బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని ఆపమంటే పిఎం మోడీ ఆపారన్నారు. సిఎం కెసిఆర్ లేఖ రాసిన మోడీ స్పందించడంలేదన్నారు. అడుగడుగునా తెలంగాణ నోట్లో మోడీ ప్రభుత్వం మట్టి కోడుతున్నారని విమర్శలు గుప్పించారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలని కార్మికులు ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణకు చెందిన బిజెపి ఎంపిలు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఒక్కో రంగాన్ని దెబ్బతీసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని విరుచుకపడ్డారు. సింగరేణి కార్మికులంగా కేంద్రం తిరగబడాలని సుమన్ పిలుపునిచ్చారు.
బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలి: సుమన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -