Monday, December 23, 2024

ఘర్ ఘర్ రేషన్ నిలిపివేయండి

- Advertisement -
- Advertisement -

Stop Ghar Ghar ration: Delhi HC

ఆప్ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వపు ఇంటి వద్దకే రేషన్ సరఫరా పథకం నిలిపివేతకు ఢిల్లీ హైకోర్టు గురువారం ఆదేశాలు వెలువరించింది. ఈ స్కీంను ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన గా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ, న్యాయమూర్తి జస్మిత్ సింగ్‌తో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. అయితే ప్రభుత్వం ఇటువంటి వేరే పథకం ద్వారా ఇంటింటికి సరుకులు పంపించవచ్చునని, అయితే రేషన్ పథకం పరిధిలో కేంద్రం సమకూర్చే ధాన్యాన్ని ఈ స్కీంలకు వాడుకోరాదని ధర్మాసనం తెలిపింది. ఈ ఘర్ ఘర్ రేషన్ స్కీంను సవాలు చేస్తూ స్థానిక రేషన్ డీలర్లు రెండు పిటిషన్లు వేశారు. ఈ స్కీంను ఆప్ ప్రభుత్వం తమ లాయర్ల ద్వారా కోర్టులో సమర్ధించుకుంది. పేదలకు ఇంటింటికి రేషన్ సరఫరా చేస్తే తప్పులేదని తెలిపింది. అయితే రాజకీయ కారణాలతోనే ఇక్కడి ఆప్ ప్రభుత్వం కావాలనే కేంద్రం పరిధిలోని జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ)ను దెబ్బతీసేలా ఈ స్కీం తీసుకువచ్చిందని కేంద్రం తరఫున స్టాండింగ్ కౌన్సిల్ మోనికా అరోరా తెలిపారు. పైగా ఈ స్కీంను కేంద్రం పంపించే రేషన్ సరుకుల ద్వారా అమలు చేస్తోందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News