Monday, December 23, 2024

ఏపిలో హంద్రీ-నీవా పనులు ఆపండి

- Advertisement -
- Advertisement -
కృష్ణాబోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్: ఎటువంటి అనుమతులు పొందకుండానే కృష్ణానదీ జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం విస్తరణ పనులు చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదీయాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది.హంద్రీ-నీవా పథకం విస్తరణ పనులను వెంటనే నిలిపివేయించాలని కోరూతూ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ శుక్రవారం నాడు కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. లేఖలో పలు అంశాలను బోర్డు దృష్టికి తీసుకుపోయారు.

హంద్రీ-నీవా పథకం విస్తరణలో భాగంగా అనంతపురం జిల్లాలోని భైవరానితిప్ప పథకం నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఏపి ప్రభుత్వం పనులు చేపడుతున్నట్టు లేఖలో వివరించారు. ఈ కొత్త పనుల ద్వారా అనంతపురం జిల్లాలోని గుమ్మగట్ట, రాయదుర్గం, బి.హీరేహల్ , కనేకల్ మండలాల పరిధిలో 58 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను కృష్ణానదీజలాలతో నింపి ఆ చెరులవుకింద ఉన్న 4100 ఎకరాల ఆయకట్టును స్ధిరీకరించే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. రాయదుర్గం అసెంబ్లీనియోజకవర్గం పరిధిలో చేపట్టిన ఈ పనులు వెంటనే నిలిపివేయించాలని కోరారు. హంద్రీ-నీవా పథక విస్తరణ పనులకు ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు.

ఏపి రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2014కు విరుద్దంగా ఈ పనులు చేపట్టినట్టు వివరించారు. ఈ కొత్త పనులకు కేంద్ర జలవనరుల సంఘం నుంచి కాని, కృష్ణానది యాజమాన్య బోర్డు నుంచి కాని , అపెక్స్ కౌనిల్స్ నుంచి కాని ఎటు వంటి అనుమతులు లేవన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంద్రీ-నీవా పథకం కింద భైరవానితిప్ప నుంచి ఎత్తిపోతల ద్వారా చెరువులను నీటితోనింపే పనులకు టెండర్లు పిలిచి ఏపిఆర్‌ఏ 2014 చట్టాన్ని అతిక్రమించిందని తెలిపారు. అక్రమంగా పనులు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపైన కృష్ణాబోర్డుతోపాటు, కేంద్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ మేరకు ఈఎన్సీ మురళీధర్ బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. ఏపి ప్రభుత్వం హంద్రీ-నీవా పథకం విస్తరణ పనులకోసం పిలిచిన టెండర్ల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రతిని కూడా బోర్డు చైర్మన్‌కు రాసిన లేఖతోపాటు జతచేసి పంపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News