- Advertisement -
బెంగళూరు: హిందీని రుద్దడం మానాలని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ ప్రధాని మోడీని ఉద్దేశించి అన్నారు. అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఇటీవల సమర్పించిన నివేదికపై ప్రతిస్పందిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు. వారు తీసుకుంటున్న ఈ చర్య ఇతర ప్రాంతీయ భాషల ఉనికి, ప్రత్యేకత, గౌరవాన్ని దెబ్బతీయడమే కాగలదన్నారు. హిందీని రుద్దడం తాము సహించబోమని ఆయన ఖరాఖండిగా తెలిపారు. ఆ నివేదికను ఆమోదించేది లేదని, ఇతర రాష్ట్రాలు కూడా దానిని వ్యతిరేకిస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
- Advertisement -