Monday, December 23, 2024

సీమ ఎత్తిపోతలను ఆపండి

- Advertisement -
- Advertisement -

కృష్ణా బోర్డుకు తెలంగాణ ఇఎన్‌సి లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా నదీ యా జమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఎపి ప్రభుత్వం అక్రమంగా రాయలసీ మ ఎత్తిపోతల పథకం పనులను కొనసాగిస్తోందని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కో రింది. ఈ మేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి)కి తెలంగాణ నీటి పారుదల ఇఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఎపి ప్రభుత్వం అక్రమంగా కొనసాగిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపేలా చర్యలు తీసుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. కెఆర్‌ఎంబి ఛైర్మన్‌కు లేఖ రాసిన తెలంగాణ నీటి పారుదల శాఖ ఇఎన్సీ మురళీధర్ ఎపి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపడుతోందని లేఖలో పేర్కొన్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను ధిక్కరిస్తోందని, 1976, 1977 అంతర్రాష్ట్ర ఒప్పందాలకు విరుద్ధంగా బేసిన్ వెలుపలకు నీటిని తరలించే పనులు కొనసాగిస్తోందని ఫిర్యాదు చేశారు.

చెన్నై తాగునీటి సరఫరా, రాయలసీమ తాగునీటి అవసరాలు, వెలిగోడు, సోమశిల, కండలేరు జలాశయాల కోసం 59 టిఎంసిల నీటిని తరలించేలా పనులు కొనసాగిస్తోందని పేర్కొం ది. బచావత్ ట్రైబ్యునల్‌కు విరుద్ధంగా బేసిన్ వెలుపలకు నీటిని తరలించే పనులు కొనసాగిస్తున్నారన్నారు. కేవలం 1500 క్యూసెక్కుల నీటిని మాత్రమే తరలించాల్సి ఉండగా 80వేల క్యూసెక్కుల సామర్థ్యం వరకు పనులు చేపట్టారని తెలిపింది. శ్రీశైలం కుడికాల్వకు లైనింగ్ పనులను కూడా చేపడుతున్నారని గతంలోనే ఫిర్యాదు చేసినట్లు లేఖలో గుర్తు చేశారు. ఒప్పందాలు, ఎన్‌జిటి తీర్పునకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పనుల వల్ల తెలంగాణ ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎపి ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రజలకు ఉన్న న్యాయమైన హక్కులను కాపాడాలని బోర్డుకు విజ్ఞప్తి చేశారు. పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించడానికి ట్రైబ్యునల్ పదవీకాలం పొడిగిస్తూ కేం ద్రం గతంలో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలపై ట్రై బ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరింది. ఈ విషయంపై 2014 లో కేంద్రం తగిన నిర్ణయం తీసుకోకపోవడంతో 2018లో తలుపులను తట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News