Monday, December 23, 2024

జూబ్లీహిల్స్ పబ్‌లలో రాత్రి 10 తర్వాత నో మ్యూజిక్

- Advertisement -
- Advertisement -

Stop music in pubs after 10pm

తీర్పు వెలువరించిన హైకోర్టు

మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని పబ్‌లకు షాకిస్తూ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో రాత్రి 10 గంటల తర్వాత పబ్‌లలో మ్యూజిక్‌ను నిలిపివేయాలని సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్, హైదరాబాద్ రెస్ట్రోలాంబ్ అసోసియేషన్‌లు హైకోర్టు డివిజన్ బెంబ్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు జూబ్లీహిల్స్‌లోని పబ్‌లకు మాత్రమే వర్తిస్తుందని తీర్పునిచ్చింది.

రాజాసింగ్ పిడి యాక్ట్ విచారణ వాయిదా

ఎంఎల్‌ఎ రాజాసింగ్‌పై నమోదైనపిడి యాక్ట్ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. రాజాసింగ్ తరపు న్యాయవాది కౌంటర్‌పై వాదనలు వినిపించనున్నారు. సోమవారం జరిగిన విచారణలో పిడి యాక్ట్ నమోదుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను న్యాయవాది ప్రస్తావించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News