Sunday, December 22, 2024

సాయిబాబా విగ్రహాల తొలగింపును ఆపండి

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర బిజెపి, కాంగ్రెస్ పిలుపు

ముంబై: ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసిలో కొన్ని ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడాన్ని మహారాష్ట్రలోని కాంగ్రెస్, బిజెపి నాయకులు తీవ్రంగా విమర్శించారు. మహారాష్ట్రకు చెందిన 19వ శతాబ్దపుపు మహా సాధువు సాయిబాబాను ఈ చర్య ద్వారా అవమానించడమేనని వారు పేర్కొన్నారు. గొప్ప జ్ఞానిగా కోట్లాదిమంది భక్తులు పూజించే సాయిబాబాను అవమానిస్తే సహించబోమని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్‌కులే అన్నారు. సాయిబాబా విగ్రహాలను తొలగించాలన్న ప్రచారాన్ని వెంటనే నిలపివేయాలని ఆయన డిమాండు చేశారు.

సాయిబాబా కుల,మత, జాతికి అతీతుడని, వారణాసిలో జరిగిన ఘటన దురదృష్టకరమని కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ తోరట్ విచారం వ్యక్తం చేశారు. సాయిబాబా దేవుడు కాదని, ఆయన గురించి పురాణాలలో ఎక్కడా ప్రస్తావన లేదని కొందరు మత గురువులు చేసిన ప్రసంగాలను పురస్కరించుకుని ఆయన విగ్రహాలను ఆలయాల నుంచి తొలగించాలని సనాతన రక్షణ దళ్ అనే గ్రూపు ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం వారణాసిలోని కొన్ని ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా షిరిడీలో సాయిబాబా తన జీవితంలో చాలా భాగం గడిపారు. సాయిబాబా సమాధిని దర్శించుకునేందుకు ఏటా కోట్లాదిమంది భక్తులు షిరిడీ ఆలయాన్ని సందర్శిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News