Thursday, January 23, 2025

ఎపి ఎత్తిపోతల ఆపండి

- Advertisement -
- Advertisement -

కృష్ణాబోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

వరికపూడిశెల పథకంతో తెలంగాణకు తీరని నష్టం
కృష్ణాబోర్డుకు ఇఎన్‌సి లేఖ
లేఖలో‘ మన తెలంగాణ’ కథనాన్ని ప్రస్తావించిన ఇఎన్‌సి

మనతెలంగాణ/హైదరాబాద్: ఎటువంటి అనుమతులు పొందకుండానే అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిపై వరికపూడిశెల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టందని కృష్ణాబోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కృష్ణానదీ ఆధారంగా నాగార్జున సాగర్ రిజర్వాయర్ బ్యాక్‌వాటర్‌పై నిర్మిస్తున్న ఈ ఎత్తిపోతల పథకం పూర్తిగా అక్రమమైనదని వెల్లడించింది. ‘కృష్ణాపై ఏపిలో మరో ఎత్తిపోత ల ’ శీర్షికన నాగార్జున సాగర్ వెనుక జలాలే లక్షం. ఏడు టిఎంసిలు వినియోగం. పల్నాడులో 75వేల ఎకరాల కు సాగునీరు. రూ.340కోట్లు వ్య యం. ప్రారంభించిన సి ఎం జగన్ అన్న అంశాలను వివరి స్తూ ఈనెల 16న ‘మన ణ’ దినపత్రికలో వచ్చిన కథనాన్ని తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు చేసిన ఫిర్యాదులో ఉదహరించింది. దశలవారీగా మొత్తం 3809కోట్ల రూపాయల వ్యయంతో వరికపూడిశెల ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నట్టు బోర్డు దృష్టికి తీసుకుపోయింది. ఈ పథకం ద్వారా నాగార్జున సాగర్ జలాశయంలోని వెనుక జలాల రోజుకు 281 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి సాగునీటికి తాగునీటికి సరఫరా చేసేందుకు ప్రాజెక్టును చేపట్టిందని తెలిపింది.

ఈ పథకానికి సంబంధించి ఇచ్చిన జి.ఒ నెం.104ను కూడా ఫిర్యాదు చేసింది. వరికపూడి శెల వాగు వద్ద ఈ పథకం హెడ్ వర్క్‌కు చెందిన వివరాలను కూడా బోర్డుకు అందజేసింది. వెల్దుర్తి మండలం పరిధిలోని గంగులకుంట గ్రామం సమీపాన ఈ పనులు చేపట్టినట్టు తెలిపింది. గతంలో కూడా శ్రీశైలం కుడిగట్టు కాలువ పథకం, తెలుగుగంగ పథకం, హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి పథకాలు, వాటి విస్తరణ పనులను కూడా ఇదే విధంగా చేపట్టిందని తెలిపింది. ఈ పథకాలకు కృష్ణానదీయాజమాన్య బోర్డు నుంచి, అపెక్సు కౌన్సిల్ నుంచి కాని ఆమోదాలు లేవని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం 2014 మేరకు అనుమతులు పొందకుండా కొత్త ప్రాజెక్టులేవి చేపట్టరాదని గుర్తు చేసింది. ఏవైనా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి అధ్యక్షతన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆందరి ఆమోదయోగ్యం మేరకు కేంద్ర జలసంఘం నుంచి, కృష్ణానదీయాజమాన్య బోర్డు నుంచి అనుమతులు పొందాలని స్పష్టం చేసింది.

వరికపూడి శెల ఎత్తిపోతల పథకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు పొందలేదని తెలిపింది. ఈ ఎత్తిపోతల పథకం నిర్మించటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులపైన ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధారంగా ఉన్న ఆయకట్టు ప్రాంతాలపై కూడా ప్రభావం పడుతుందని తెలిపింది. వరకపూడి శెల ఎత్తిపోతల పథకం పనులను వెంటనే నిలిపివేయించాలని కోరింది. అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించి కేంద్రజలసంఘం, కృష్ణాబోర్డుల ఆమోదం పొందిన తరువాతనే ఈ పథకం చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ ఈ మేరకు కృష్ణానదీయాజమాన్యబోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News