Wednesday, April 2, 2025

మ‌హిళా సాధికార‌త‌పై బిజెపి ప్ర‌చారంపై ఎమ్మెల్సీ క‌విత కౌంట‌ర్

- Advertisement -
- Advertisement -

Stop the PR against women empowerment: MLC Kavitha

మహిళా సాధికారతపై బీజేపీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి

హైదరాబాద్: మ‌హిళా సాధికార‌త‌పై బీజేపీ నాయ‌కులు చేస్తున్న ప్ర‌చారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత కౌంట‌ర్ ఇచ్చారు. మ‌హిళ‌ల‌పై ఏ మాత్రం గౌర‌వం ఉన్నా.. మ‌హిళా సాధికార‌త‌పై నిజాలను దాచి చేస్తున్న త‌ప్పుడు ప్ర‌చారాల‌ను ఆపాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌హా బీజేపీ నేత‌ల‌కు సూచించారు. దిగువ మధ్యతరగతి మహిళలను‌ నేరుగా ప్రభావితం చేస్తున్న ధరల పెరుగుదలను నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింద‌ని ధ్వ‌జ‌మెత్తారు క‌రోనా నుంచి గ్రామాల‌ను ర‌క్షించ‌డంలో అంగ‌న్‌వాడీ సోద‌రీమ‌ణులు కీల‌క‌పాత్ర పోషించార‌ని తెలిపారు. త‌ల్లీబిడ్డ‌ల పోష‌కాహార స్థాయిని పెంచ‌డంలో తీవ్రంగా కృషి చేస్తున్నార‌ని పేర్కొన్నారు. అలాంటి అంగ‌న్‌వాడీల‌కు 50 శాతం బ‌డ్జెట్‌ను త‌గ్గించిన బీజేపీ ప్ర‌భుత్వం.. త‌క్ష‌ణ‌మే ఆ సోద‌రీమ‌ణుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఎమ్మెల్సీ క‌విత డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News