న్యూఢిల్లీ : ‘నీళ్లు తాగుతుండాలి’ అనే సులభ మంత్రాన్ని అనుసరించేందుకు జనం తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సంక్షేమ యాప్‌లు తెరవడం నుంచి ప్రత్యేక అలారమ్‌లు ఏర్పాటు వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కొంత మందికి మంచి నీరు తాగడం ఎంత ముఖ్యమో ఏదో రీల్‌ను చూసి మరీ ఒక చుక్క నీరు తాగుతారు. నిజమే. ఆరోగ్యానికి నీరు అత్యవసరమే. నీటిని రోజూ క్రమంగా తాగుతుండాలి. మొత్తంగా రోజుకు మూడు లీటర్ల నీరు సరిపోతుంది. జనం చర్మం, కాలేయం, పేగులు, ఇంకా చెప్పాలంటే మొత్తం శరీరం అందుకు ధన్యవాదాలు చెబుతాయి. పునర్వినియోగ నీళ్ల సీసా కచ్చితంగా ఉపయుక్తమే. ప్రయాణంలో ఉన్నా లేక పని చేస్తున్నా లేక స్టడీ రూమ్‌లో గంటల కొద్దీ గడుపుతున్నా వెంట ఒక నీళ్ల సీసా ఉంటే జలపానం లక్షాల సాధనకు సులభ మార్గం అవుతుంది. ఎప్పటికప్పుడు ఒక చుక్క నీరు తాగుతుండాలి.
సీసాలో నీటిని పూర్తిగా తాగినప్పుడు దానిని మళ్లీ నింపాలి. సాధారణంగా జనం చేసే పని అది. అయితే, నీళ్ల సీసాను కడగకపోవడం వల్ల అసంఖ్యాకంగా బ్యాక్టీరియా, మడ్డి అందులో చేరవచ్చు. తుదకు జనం ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. ‘మైక్రో ఆర్గానిజాల తగ్గింపునకు రోజూ నీళ్ల సీసాను కడగడం ముఖ్యం. సీసాలో నీరు ఎక్కువ సేపు నిలవ ఉన్నప్పుడు బ్యాక్టీరియా, మడ్డి చేరే అవకాశం ఉంటుంది. అవి క్రమంగా పేరుకుపోవచ్చు’ అని న్యూఢిల్లీలోని బిఎల్‌కె మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రిన్సిపల్ డైరెక్టర్, హెచ్‌ఒడి (ఇంటర్నల్ మెడిసిన్) డాక్టర్ రాజీందర్ కుమార్ సింగల్ చెప్పారు. 2017లో సివిల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ విభాగం ప్రచురించిన నివేదిక ప్రకారం, ఒక వయోజనుని పునర్వినియోగ నీళ్ల సీసాల సుమారు 75 వేల బ్యాక్టీరియా ఉండవచ్చు’ అని గురుగ్రామ్‌లోని సికె బిర్లా ఆసుపత్రి ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ తుషార్ తయల్ సూచించారు.