Sunday, November 17, 2024

మీ ప్రకటనలు ఆపండి

- Advertisement -
- Advertisement -

కర్నాటక ప్రభుత్వంపై ఇసి ఆగ్రహం

తెలంగాణలో ఎన్నికల ప్రకటనలు ఇవ్వడంపై మండిపాటు
అనుమతులు లేకుండా ఎలా ఇస్తారని ప్రశ్న

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై బిఆర్‌ఎస్ నాయకులు ఇచ్చిన పిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది. క ర్నాటక ప్రభుత్వంపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కర్నాటక ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై తీవ్రంగా పరిగణించింది. సోమవారం కర్నాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ప్రకటనల జారీ ఎన్నికల నియమావళి ఉల్లంఘన అవుతుందని పేర్కొంది. మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఇసి ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ప్రకటనలను నిలిపివేయాలని హెచ్చరించింది. సంబంధిత శాఖ కార్యదర్శిపై చర్యలు ఎందుకు తీసుకోలేదో తెలిపాలని పేర్కొంది. ప్రకటనల కోసం కర్నాటక ప్రభుత్వం తమ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని తెలిపింది. ప్రకటన కోసం కర్నాటక ప్రభుత్వం కనీసం దరఖాస్తు కూడా చేయలేదని వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News