Friday, December 20, 2024

ఉద్యోగుల,ఎమ్మెల్యేల జీతాలు ఆపి రైతుబంధు వేశాం : మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

తూప్రాన్ డివిజన్ కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనాన్ని సోమవారం మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రైతులకు రాష్ట్రంలో ఉచిత కరెంటు సరఫర చేస్తున్నమాని అన్నారు. తులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు అందిస్తున్నామని, రైతు బంధు ద్వారా 65 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన రైతు బాంధవుడు సిఎం కెసిఆర్ అని ఆయన పేర్కొన్నారు. రైతు చనిపోతే రైతు బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి రైతు కుటుంబాన్ని ఆదుకుంటున్నామని తెలిపారు.

98 వేల మంది రైతుల కుటుంబాలకు రైతు భీమా ద్వారా ఐదు లక్షలు ఇచ్చామని, ఎండాకాలంలో కూడా హల్దీ వాగు చెక్ డ్యామ్ ల పై నుండి మత్తడి దూకుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీస్సులతో తూప్రాన్ లో మూడు మార్కెట్లు వచ్చాయని అన్నారు. గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వారు ఒక్క మార్కెట్ కూడా ఇవ్వలేదని, కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగుల, ఎమ్మెల్యేల, జీతాలు ఆపి రైతులకు రైతుబంధు వేశామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News