Monday, December 23, 2024

ఔటర్ చుట్టూ ఇసుక నిల్వలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా టిఎస్‌ఎండిసి ( తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇసుక ధరలు పెరగకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో దానికి తగ్గట్టుగానే టిజిఎండిసి ఎండి, మై నింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్ చర్యలు చేపట్టారు. ఇసుకను బ్లాక్‌మార్కెట్ చేయకుండా, ప్రభుత్వ ధరకే ఇసుకను అందించాలని దానికోసం డంపింగ్ యార్డులను (సుమారుగా లక్ష పైచిలుకు మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేసేలా) ఏర్పాటు చే యాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ముందస్తుగా ఓఆర్‌ఆర్‌కు నలువైపులా నాలుగు డం పింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని టిజిఎండిసి ఎండి ప్రణాళికలు రూపొందిస్తున్నా రు. దీనికి ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని కలెక్టర్‌లకు టిజిఎండిసి లేఖ రాసింది. ఓఆర్‌ఆర్‌ను ఆనుకొని ప్రభుత్వ భూమి కావాలని టిజిఎండిసి ఆ లేఖలో కలెక్టర్‌లను కోరింది. ఒక్కో డంపింగ్ యార్డులో సుమారుగా లక్ష మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేసేలా సుమారు మూడు, నాలుగు ఎకరాల భూమి కావాలని టిజిఎండిసి ఆ లేఖలో కలెక్టర్‌లకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం టిజిఎండిసి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 45కు పైగా రీచ్‌లను నడిపిస్తోంది.

వర్షాలు కురిసినప్పుడు కొన్ని రీచ్‌లను మూసివేసినా మిగతా రీచ్‌ల్లో ఇసుక కొరత రానీయకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. కొన్ని సంవత్సరాలుగా దళారులు ఇసుక కొరతను సృష్టించడంతో పాటు దానిని అధికరేటుకు అమ్ముకుంటున్నారు. దీనికి చెక్ పెట్టడానికే ఆ శాఖ ఎండి చర్యలు చేపట్టారు. వీటితోపాటు రాష్ట్రంలోని 33 జిల్లాలో హైదరాబాద్, నిర్మల్, సంగారెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాలు మినహా మిగతా జిల్లాలో మొత్తం 328 స్టాక్ యార్డులను (చిన్నవి) గతంలో టిజిఎండిసి ఏర్పాటు చేసింది. రీచ్‌ల్లో తవ్విన ఇసుకను ఎప్పటికప్పుడు స్టాక్‌యార్డుల్లో డంప్ చేస్తోంది. ప్రస్తుతం టిఎస్‌ఎండిసి ఈ 328 స్టాక్‌యార్డుల్లో ఇసుకను వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News