Monday, December 23, 2024

నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Stored Ration Rice Seized in Karepalli

కారేపల్లిః వ్యవసాయ భూమిలో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన శుక్రవారం ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కారేపల్లి ఎస్‌ఐ కుశకుమార్ తెలిపిన వివరాల ప్రకారం…. మండల పరిధిలోని పంతులు నాయక తండా గ్రామశివారులోని వ్యవసాయభూమిలో సుమారు 180 బస్తాలతో రేషన్ బియ్యాన్ని నిల్వ చేసి, కనిపించకుండా ఉండేందుకు పట్టాలు కప్పి పెట్టారని విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం టాస్క్‌ఫోర్స్, కారేపల్లి పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా దాచి ఉంచిన రేషన్ బియ్యం పట్టుకోవడం జరిగిందన్నారు. సుమారు 75 క్వింటాళ్ల వరకు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఈ బియ్యం ఇల్లందు దగ్గర వేపలగడ్డకు చెందిన బానోతు రమేష్, బానోతు కోటేశ్‌లకు చెందినవిగా గుర్తించామన్నారు. నిందితులపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ లో సిఐ రమేష్, ఎస్‌ఐ నరేష్, కారేపల్లి కానిస్టేబుల్ సీతారాములు తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News