- Advertisement -
ఢాకా: మోచా తుఫాను ఆదివారం నేల తాకనుండడంతో బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలు వేలాది మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. మోచా తుఫాను వల్ల అక్కడ పెను నష్టం సంభవించే అవకాశాలున్నాయి. బంగ్లాదేశ్ శరణార్థి శిబిరాలలో మయన్మార్ నుంచి పారిపోయి వచ్చిన లక్షలాది మంది శరణార్థులు నివసిస్తున్నారు. గాలి వేగం గంటకు 210 కిమీ. (130 మైళ్ల) వేగంతో వీచనున్నది. ఈ తుఫాను హరికేన్ 4వ కేటగిరికి సమానం.
బంగ్లాదేశ్ వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలు జారీచేసింది. కోస్తా జిల్లాల్లో హఠాత్తుగా వరదలు, కొండచరియలు విరిగిపడ్డాలు జరగొచ్చని భావిస్తున్నారు. కాక్స్‌బజార్‌కు 10వ ప్రమాద సిగ్నల్‌ను ఎగురవేసింది(1 నుంచి 11వరకు ఉండే స్కేల్) బంగ్లాదేశ్. కోస్తా జోన్‌లోని అన్ని రేవు పట్టణాలను, విమానాశ్రయాలను మూసేసింది.
- Advertisement -