- Advertisement -
హైదరాబాద్: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. తుపానుకు వాతావరణ శాఖ మిథిలీ అనే పేరు పెట్టింది. ఒడిశాలోని పారాదీప్‌కు 190 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. గంటకు 20 కిలో మీటర్ల వేగంతో ఉత్తర వాయవ్యంగా తుపాను కదులుతోంది. రేపు ఉదయం బంగ్లాదేశ్ తీరంలోని ఖెపుపారా వద్ద తుపాను తీరం దాటనుంది. తీరం దాటుతున్నప్పుడు బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో 80 కిలో మీటర్ల పైగా వేగంతో గాలులు వీస్తాయి.
- Advertisement -