Friday, November 22, 2024

బాలలు సృష్టించిన కథా ప్రపంచం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ విద్యశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మన ఊరు – మన చెట్టు కార్యక్రమంలో భాగంగా అయిదు లక్షల మంది పిల్లల కథలు రాయడం ఒక అక్షరవిప్లవమని సాహిత్య అకాడమి ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఆ కథలన్నిటినీ ఒక దగ్గర చేర్చి ‘చిలుకలదండ’ పేరుతో కథల పుస్తకంగా మలిచడం వల్ల పిల్లల శృజనాత్మకతను ప్రోత్సహించిన వాళ్ళమవుతామని, ఇది శుభపరిణామమని తెలిపారు. శనివారం నాడు సాహిత్య అకాడమి కార్యలయంలో ‘చిలుకలదండ’ కథలు పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయిన మాట్లాడుతూ మనందరం చదువుకునే పాఠశాలలన్నీ పుస్తకాల సుగంధాలతో పాటు కథల పరిమళాలు వెదజల్లుతున్నాయన్నారు. బాలలు తమ సృజనతో కొత్త కథా ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని ప్రసంశించారు. ఈ కార్యక్రమంలో ప్రసిద్ద బాల సాహితి వేత్తలు డా. భూపాల్, డా. వి.ఆర్. శర్మ, గరిపల్లి అశోక్, పైడిమర్రి రామకృష్ణ, ఎన్.బి.టి. తెలుగు ఎడిటర్ డా. పత్తిపాక మోహన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News