Sunday, December 22, 2024

దసరాలోపు ఎస్టిపిలను పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

31 కొత్త ఎస్టిపిల పనులు సమీక్షా సమావేశంలో జలమండలి ఎండి దానకిషోర్

 


మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో 100 శాతం మురుగు శుద్ది చేయడమే లక్షంగా సుమారు రూ.3800 కోట్లతో చేపడుతున్న 31 కొత్త ఎస్టీపీలను (సివరేజ్ ప్లాంట్ల)నిర్మాణాన్ని దసరాలోపు పూర్తి చేయాలని,ఇందుకు తగిన విధంగా ప్రణాళికా బద్దంగా పనులు జరగాలని జలమండలి ఎండి దాన కిషోర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం అంబర్‌పేటలోని జలమండలి ఎస్టీపీ ప్రాంగణంలో ఆయన జలమండల ఎస్టీపీ విభాగా ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే అనుమతులు లభించిన స్థలాల్లో సాయిల్ టెస్టులు పూర్తి చేసి వెంటనే నిర్మాణ పనులును ప్రారంభించాలని ఆదేదశించారు.

భూమిక సంబంధించిన సమస్యలు ఉన్న ప్రాంతాల్లో త్వరగా వాటిని పరిష్కరించుకుని అనుమతులు తీసుకువచ్చే విధంగా అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించారు. ప్రతి ఎస్టీపికి సంబంధించి ఏ రోజుకు ఆ రోజు చేయాల్సిన పనులపై చెక్ లిస్టు రూపొందించుకుని ఖచ్చితంగా ఆ రోజు పనులు పూర్తి చేయాలన్నారు. ఈ చెక్ లిస్టు వివరాలు జలమండలి అధికారులు వద్ద, సైట్ ఇంజనీర్లు,నిర్మాణ సంస్థ ప్రతినిధుల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. అంతే కాకుండా అన్నీ ఎస్టీపీల ప్లాన్‌లను సాధ్యమైనంత త్వరగా రూపొందించి వేగంగా పనులు మొదలు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి ఎస్టీపికి సంబందించిన పూర్తి ప్రాజెక్టు వివరాలు, వర్క్ షెడ్యూళ్ళను రూపొందించుకుని ఆ ప్రకారం ప్రణాళికాబద్దంగా పనులు జరిపి దసరావరకు ఎస్టీపీలను పూర్తి చేయాలని సదరు నిర్మాణ సంస్థకు సూచించారు. మొదటి దశలో భాగంగా నిర్వహించే పనులు ఈ ఏప్రిల్ లోపు పూర్తి చేస్తేనే దసరా నాటికి ఎస్టీపీఉ పూర్తి చేసే అవకాశం ఉంటుందని కాబట్టి అందుకు అనుగుణంగా పనుల జరిగేలా చూడాలన్నారు. ఏక కాలంలో ఎస్బీర్ ( సీక్వెన్షల్ బ్యాచ్ రియాక్టర్) ,సిసిటీ (క్లోరిన్ కాంటాక్ట్ ట్యాంక్) తదితర పనులు పూర్తి చేయాలన్నారు. అన్ని ఎస్టీపీలు సెప్టెంబర్‌లో ట్రయల్ రన్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.

ఎస్టీపీల నిర్మాణ పనులు నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు జలమండలి ఎండి దానకిషోర్ సూచించారు. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసి జలమండలి ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలన్నారు. 24 గంటలు మూడు షిఫ్ట్‌లు పనులు జరిపించాలని, ఇందుకు తగిన విధంగా కార్మికులు, నిర్మాణ సామాగ్రి, యంత్రాలు, సిద్దం చేసుకోవాలని సూచించారు. ఎస్టీపీ ప్రాంగణంలో మూడ షిప్టుల్లో సైట్ ఇంజనీరుల ఖచ్చితగా పనులు పర్యవేక్షించాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు ఆదేశించారు.

ఎస్టీపీ నిర్మాణ పనుల్లో పని చేస్తున్న కార్మికులకు అన్ని రక్షణ చర్యలు పాటించేలా చూడాలని, రక్షణ పరికరాలను తప్పని సరిగా వినియోగించే చూసుకోవాలన్నారు. రాతి వేళల్లో పని జరుగుతున్నప్పడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సరిపడ వెలుతురు, ఉండే విధంగా ఎల్‌ఈడి లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఎస్టీపీలతో సహా సుందరీకరణ పనులు కూడా జరిపించేందుకు ప్రణాళికలు రూపొందించు కోవాలని సూచించారు. ఎస్టీపీ ప్రాంగణాల్లో ఆహ్లాదకరణ వాతావరణాన్ని కల్పించేందుకు గాను ల్యాండ్ స్కేప్‌ను అభివృద్ద చేయాలన్నారు. నిర్మాణ పనులు వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చుట్టూ బ్లూ షీట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్టీపీ ప్రాంగణంలో వివిధ దశల నిర్మాణపనులుతో కూడిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్టు డైరక్టర్ శ్రీధర్‌బాబు, సిజీఎంలు,జీఎంలు,డీజీఎంలు, మేనేజర్లు,నిర్మాణ సంస్థ ప్రతినిధులు సై ట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News