Monday, December 23, 2024

ఎస్టీపీలను ట్రయల్ రన్‌కి సిద్ధం చేయాలి

- Advertisement -
- Advertisement -

అధికారులను ఆదేశించిన ఎండీ దానకిశోర్
శనివారం పలు ఎస్టీపీల సందర్శన

మన తెలంగాణ/ హైదరాబాద్: ఎస్టీపీ పనుల్లో వేగం పెంచి, తుది దశలో ఉన్న వాటిని ట్రయల్ రన్ కోసం సిద్ధం చేయాలని ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఫతే నగర్, పెద్ద చెరువు, నల్ల చెరువు ఎస్టీపీలను సందర్శించారు. తొలుత ఫతే నగర్ (133 ఎంఎల్డీ సామర్థ్యం) ఎస్టీపీకి వెళ్లిన ఆయన అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. ఎస్టీపీ నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. పనులు వేగంగా జరిగేందుకు అదనపు కార్మికు బృందాలను సమకూర్చుకోవాలన్నారు. 24 గంటలు పనులు జరిగేలా చూడాలని, వీరంతా 3 షిఫ్టుల్లో పనిచేసి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

రాత్రి వేళల్లో పనిచేసేందుకు వీలుగా పనులు జరిగే ప్రదేశంలో లైటింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను పేర్కొన్నారు. మిగిలిన సివిల్ పనులు పూర్తి చేసి, యంత్రాల బిగింపు ప్రక్రియలో వేగం పెంచాలని సూచించారు. అనంతరం పెద్ద చెరువు, నల్ల చెరువు ఎస్టీపీలను సైతం సందర్శించారు. ఈ రెండు ఎస్టీపీల ప్రాంగణాల్లో అంతర్గత రహదారులు, సుందరీకరణ, పెయింటింగ్ పనులు స్థితి గతులనను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిపోయిన ఇతర చిన్న చిన్న పనుల్ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి ఈ నెలాఖరుకల్లా ట్రయల్ రన్ నిర్వహించాలని ఆదేశించారు. పని జరిగే ప్రదేశంలో కార్మికులందరూ తగిన రక్షణ చర్యలు పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఈడీ డా.ఎం. సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, ఎస్టీపీ సీజీఎంలు రఘు, సుజాత, జీఎంలు, ఇతర అధికారులు నిర్మాణ సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు.

మురుగు సమస్యకు పరిష్కారం :
మొత్తం 3 ప్యాకేజీల్లో, 5 సర్కిళ్లలో నిర్మిస్తున్న ఈ 31 ఎస్టీపీలు అందుబాటులోకి వస్తే నగరంలో ఉత్పన్నమయ్యే మురుగు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వీటి ద్వారా రోజూ 1282 ఎంజీడీల మురుగు నీటిని శుద్ధి చేయవచ్చు. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News