Wednesday, January 22, 2025

విమానంలో ప్రయాణికురాలి వింత ప్రవర్తన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లఖ్‌నవూ నుంచి ముంబైకి వెళ్లాల్సిన ఆకాశ్ ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానంలో ఓ ప్రయాణికురాలు వింతగా ప్రవర్తించింది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడంతో సిబ్బంది ఆమెను కిందకు దించేశారు. మళ్లీ లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్న సిబ్బందిలో ఒకరి చేతిని బలంగా కొరికింది. దీంతో ఆమెను పోలీస్‌లకు అప్పగించారు. ఆ మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్నారు.

ప్రయాణికుడ్ని కాపాడిన ఆర్మీ మ్యాన్
మరోవైపు గోవా నుంచి చండీగఢ్‌కు బయలుదేరిన విమానంలో ఆర్మీకి చెందిన వైద్యుడు ఒకరు మానవత్వాన్ని చాటుకున్నారు. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. అప్పుడు విమానం 40 వేల అడుగుల ఎత్తులో ఉంది. దీంతో బాధితుడిని కాపాడేందుకు మేజర్ సిమ్రత్ రాజ్‌దీప్ ప్రయత్నించారు. అందుబాటులో ఉన్న మెడికల్ కిట్ సాయంతో అతడి ప్రాణాలు కాపాడేరు. చాలా కాలంగా అతడు శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. రాజ్‌దీప్ అభ్యర్థనపై విమానం అత్యవసర ల్యాండింగ్ చేసిన తరువాత బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News