Wednesday, January 22, 2025

అంతరిక్షంలో విచిత్ర నక్షత్ర విస్ఫోటనం

- Advertisement -
- Advertisement -

180 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో చదునైన భారీ విస్ఫోటనాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. సాధారణంగా నక్షత్రాలు గోళాకారంలో విస్ఫోటనం చెందుతుంటాయి. కానీ 2018 లో శాస్త్రవేత్తలు అంతరిక్షంలో చాలా లోతైన ప్రదేశంలో అసాధారణమైన నక్షత్ర విస్ఫోటనాన్ని గమనించారు. అది గోళాకారం కాకుండా చదునుగా విస్ఫోటనం అయిందని యూనివర్శిటీ ఆఫ్ షెఫీల్డ్‌కు చెందిన ఆస్ట్రోఫిజిక్సు లెక్చరర్ జస్టిన్ మౌండ్ వెల్లడించారు.

ఇప్పుడీ అధ్యయనానికి ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. 2018 జూన్‌లో అనుకోకుండా ధ్రువణ కాంతిని (polarized light ) గమనించారు. హవాయి లోని టెలిస్కోప్ ద్వారా దీన్ని దర్శించారు. ఈ విస్ఫోటనం కాంతి కన్నా 10 శాతం ఎక్కువ వేగంతో కణాలను వెలువరించిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మౌండ్ అధ్యయనంలో పరిశోధకులు ధ్రువ కాంతిని గణించ గలిగారు.

ఈ విస్ఫోటన కాంతి భూమి తాలూకు సౌర వ్యవస్థ అంతటి పరిమాణంలో ఉందని అది 180 మిలియన్ కాంతి సంత్సరాల దూరంలో పాలపుంతలో ఉందని అంచనా వేశారు. ఇప్పటి తాజా పరిశోధన ఈ విధమైన ఐదో రకందని పేర్కొన్నారు. ఈ విస్ఫోటనం తమ ముందస్తు అంచనాలను సవాలు చేస్తోందని, విశ్వంలో నక్షత్రాలు ఎలా విస్ఫోటనం చెందుతాయో, అలాగే ఇలా అసహజంగా, విచిత్రంగా కూడా విస్ఫోటనం చెందడానికి అవకాశం ఉండవచ్చని తెలుస్తోందని పరిశోధకులు మౌండ్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News