Thursday, January 23, 2025

బిర్యాని బిల్లు కట్టమన్నందుకు మేనేజర్​పై దాడి

- Advertisement -
- Advertisement -

Strangers attack restaurant manager in Warangal

వరంగల్: అరెపల్లి అతిథి రెస్టారెంట్ లో దారుణం చోటుచేసుకుంది. రెస్టారెంట్ మేనేజర్ సతీష్ పై మంగళవారం ఆగంతకులు దాడి చేశారు. మేనేజర్ పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిర్యానీ తిని బిల్లు కట్టకపోవడంతో మేనేజర్ డబ్బులు అడిగాడు. డబ్బులు ఇవ్వకుండా ఆగంతకుడు ఆయనతో గొడవకు దిగాడు. రాత్రి మళ్లీ హోటల్ కు వచ్చి మేనేజర్ సతీప్ దాడికి పాల్పడ్డాడు. ఈ  దాడిలో నితీష్ కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతనిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు అమిగే నితీష్ బుధవారం హసన్ పర్తి పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. నితీష్ పై సుమార్ 10 మంది దాడి చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News