Monday, January 13, 2025

నిజామాబాద్ లో 11 మంది  పిల్లలను కరిచేసిన వీధి కుక్క

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: ఓ వీధి కుక్క తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో  శనివారం 11 మంది పిల్లలను కరిచి గాయపరిచింది. గాయపడిన పిల్లలంతా 12 ఏళ్ల వయస్సు లోపలి వారే.  కుక్క శనివారం సాయంత్రం ఊరు మీద పడి స్వైర విహారం చేసింది. కనిపించినోడినల్లా శనివారం ఉదయం నుంచి  కరుస్తూ పోయింది. అయితే ఆ కుక్కను తర్వాత సాయంత్రానికల్లా పట్టుకుని బంధించారు.

మొదట్లో గోలే బంగ్లా కాలనీ వద్ద ఇద్దరు పిల్లలను కుక్క కరిచింది.  తర్వాత చుట్టుపక్కల కాలనీలోని పిల్లలను కరుస్తూ పోయింది. గాయపడిన పిల్లలను ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలోని వాసులు ఊర కుక్కల సంఖ్య బాగా పెరిగిపోయాయని ఫిర్యాదు చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. యాంటీ- ర్యాబీస్ వ్యాక్సిన్ల కొరత కూడా కొన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వేరే జిల్లాల్లో కూడా కుక్కల బెడద అప్పుడప్పుడు వార్తల్లోకి వస్తూనే ఉంది. తెలంగాణలో వీధి కుక్కల సంఖ్య ను తగ్గించే చర్యలు మాత్రం కనిపించడంలేదు. వాటికి సంతాన నిరోధక ఇంజెక్షన్లను ఇచ్చి మళ్లీ వదిలేస్తున్నారని వినికిడి.

Nizamabad Dog..

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News