Friday, December 20, 2024

బాలుడిపై వీధికుక్కల దాడి..

- Advertisement -
- Advertisement -

హనుమకొండ: వీధికుక్కల దాడిలో మరో బాలుడు బలైపోయాడు. ఈ విషాద సంఘటన హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే క్వార్టర్స్ సమీపంలో చోటుచేసుకుంది. వీధి కుక్కలదాడిలో చోటా (10) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. చనిపోయిన బాలుడు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వలస కూలీ కుమారుడిగా గుర్తించారు.

కుమారుడిని కోల్పోయి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మేయర్ గుండు సుధారాణి స్పందించారు. బాధిత కుటుంబానికి వరంగల్ మహానగర పాలక సంస్థ తరుపున రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం తరుపున వారి స్వస్థలానికి వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తామని దాస్యం వినయ్ భాస్కర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News