రెండుమూడు రోజుల శిశువును వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. నోటిలో పెట్టుకుని రోడ్ల మీద పరుగులు తీశాయి. స్థానికులు గమనించి కుక్కలను తరిమి కొట్టారు. అక్కడికి వెళ్లి చూడగా రెండు మూడు రోజులు మగ శిశువు మృతి చెంది ఉండటం కనిపించింది. కన్న పేగు బంధం ఎక్కడుందో కానీ అలా పారేసిపోయింది. ప్రేమ మానవత్వం బంధుత్వం అన్ని మరిచిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని బోర్గాం గ్రామంలో రెండు మూడు రోజుల క్రితమే జన్మించిన ఓ మగ శిశువు వీధికుక్కల నోట్లో నుండి జారిపడింది.
ఎస్సీకాలనీలో కుక్కలు ఓ వ్యక్తి ఖాళీ ప్లేస్ వద్ద ఈ శిష్యుని వదిలిపెట్టాయి. అక్కడి స్థానికులు వెళ్లి చూడగా కాళ్ళను కొరికి వేసినదృశ్యాలు కనిపించాయి. విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై సాయన్న మృతిచెంది ఉన్న మగ శిశువును ఎవరిదని ఆరాతీశారు. గ్రామంలో అంగన్‌వాడీ ఆశా వర్కర్లను పిలిపించి గ్రామానికిచెందిన వారు ఎవరైనా ఈ సంఘటనకు పాల్పడి ఉన్నారా అడిగి తెలుసుకున్నారు. పూర్తివివరాలు ఇంకా తెలిసి రాలేదు. గ్రామ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.