Sunday, December 22, 2024

తెలంగాణలో వీధి కుక్కల బెడద

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఊర కుక్కలు చేస్తున్న దాడులు ఇంతంత కాదు. బుధవారం రాత్రి ఊర కుక్కలు హుజురాబాద్ లో దాదాపు 29 మందిపై దాడిచేసి కరిచాయి. వారందరికీ తీవ్ర గాయాలయ్యాయి. హుజురాబాద్ అనే కాదు హైదరబాద్ సహా అనేక ప్రదేశాలలో కుక్కలు విరుచుకుపడుతున్నాయి. కుక్కలకు సంతాన నిరోధక ఇంజెక్షన్లు ఇచ్చేయడంతో తమ పనైపోయింది అనుకుంటున్నారు సిబ్బంది.

కుక్కలు చిన్నా పెద్ద , మహిళలు అన్న తేడా లేకుండా ఎవరిని పడితే వారిని కరిచిపారేస్తున్నాయి. రాత్రి పూటయితే ఇక రచ్చే. ఇటీవల ఘట్కేసర్ ప్రాంతంలో కూడా ఓ కుక్క 14 ఏళ్ల బాలుడిని వెంటాడింది. ఆ ప్రాంతంలో కుక్కల దాడులు చెప్పనలవి కాదు. సంగారెడ్డిలో కూడా ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఆ పిల్లాడికి అనేక గాయాలయ్యాయి.

ఊరకుక్కల దాడుల విషయంలో తెలంగాణ హైకోర్టు కూడా సీరియస్ అయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జిహెచ్ఎంసి)కి దాడులు నివారించాలని ఆదేశాలిచ్చింది. మళ్లీ మళ్లీ ఇలా కుక్కల దాడులు జరుగకుండా చూడాలని హెచ్చరించింది.  అయినా ఊరకుక్కలు ఏ యేడాది కా ఏడాది సంఖ్య ఎందుకు పెరిగిపోతుందో అర్థం కావడంలేదు. దాడులు కూడా బాగానే పెరిగిపోతున్నాయి. అసలు అధికారులు పనిచేస్తున్నారా, నిద్ర పోతున్నారా అన్నది అర్థం కావడం లేదు. ప్రజా రక్షణ వారికి పట్టదా? అనిపిస్తోంది.

విశేషం ఏమిటంటే ప్రపంచంలో భారత్ లోనే ఊరకుక్కలు ఎక్కువ. ముఖ్యంగా పట్టణాల్లో. పిల్లలను, వృద్ధులను ఒక ఆట ఆడేసుకుంటున్నాయి ఈ ఊర కుక్కలు. ప్రపంచంలో జరిగే రేబిస్ మరణాల్లో ఇండియాలోనే 36 శాతం అంటే నమ్మశక్యంగా లేదు. కానీ నిజం అదే. ప్రపంచంలో అత్యధిక కుక్కలు ఉండడం, అత్యధిక రేబిస్ మరణాలు సంభవించే దేశంగా ఇండియా ప్రసిద్ధి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News